- Bonafide Voices
బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ఎక్కు పెట్టిన బాణం కెప్టెన్ లక్ష్మీ సెహగల్.
జి.ప్రియాంక
పరిశోధకులు
బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, భారత దేశ స్వాతంత్ర్య సాధనకై మిలిటెంట్ పోరాటం జరిపిన కొద్దిమంది మహిళల్లో కెప్టన్ లక్ష్మీ సెహగల్ ఒకరు.

లక్ష్మీ సెహగల్ 1914లో అక్టోబర్ 24వ తేదీన మద్రాసులో ఎస్ స్వామినాథన్, అమ్ము స్వామినాథన్ (అమ్మ కుట్టి) దంపతులకు రెండవ సంతానం. తండ్రి ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లవవసీ వస్తే జాతిని కోల్పోయినట్లే అని బందువులు అడ్డుకున్నారు. బాలికల స్వేఛ్ఛకు , విద్యకు అడుగడుగునా ఆటంకాలే.సెహగల్ బాల్యం లో దళితులుతో కలసి ఆడుకోవటం , భుజించటం మహా పాపం. లక్ష్మీ సెహగల్ తండ్రి పేద భ్రాహ్మ్ న్ కుటుంభం లో పుట్టి నప్పటికి తన సొంత తెలివి తేటలు ఉపయోగించి చదువుకునీ ఉన్నత స్థాయి కి ఎదిగారు. అనంతరం పేరు మోసోన న్యాయ వాది అయ్యారు. కాని ఒక భారతీయునీ కేసు వాదించి బ్రిటీష్ వానికి వ్యతీరేకంగా వాదించటం కారణంగా దాని ప్రభావం లక్ష్మీ సెహగల్ పై పడింది. సెహగల్ కళాశాలలకు పోతే మీ నాన్న బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వాదించాడని సీటు ఇచ్ఛే పరిస్థితి లేదు. 1938 వ సంవత్సరంలో మద్రాస్ మెడికల్ కలేజిలో వైద్య విద్య ను అభ్యసించారు.1936 వ సంవత్సరంలో బికెఎన్ రావు తో వివాహం జరిగింది కాని ఆరు నెలల కాలంలోనే వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడి విడిపోయారు. ఆ ఒంటరి తనం కారణంగా మానసిక సమష్య నుండి బయట పడుటకు సింగపూర్ వెళ్లి వైద్య వ్య్రత్తి ని చేపట్టారు. సింగపూర్ లో పరిచయం అయిన ఆమె భావాలకు దగ్గర అయిన వ్యక్తి ప్రేమ్ సెహగల్ను వివాహం చేసుకున్నారు వారి దంపతులకు ఇద్దరు సంతానం.
లక్ష్మీ సెహగల్ చిన్న నాటి కాలం పరిస్థితి పరిశీలించినట్లయితే విదేశాలకు వెళితే జాతిని కోల్పోయినట్లే అన్న నానుడి , దళితులు పట్ల తీవ్ర స్థాయిలో వివక్ష , లింగ వివక్ష మరియు భారతీయులపట్ల బ్రిటిష్ వారి దౌర్జన్యం ఉన్నటువంటి పరిస్థితి.
ఇటు వంటి పరిస్థితి లలో లక్ష్మీ సెహగల్ వైద్య విద్యను అభ్యసించటం , బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం అంటే అది ఒక సాహసోపేతమైన చర్య.
తండ్రి మరణాంతర ము తల్లి రాజకీయ కార్యాకలాపాలు మరింత ఎక్కువయినాయి. సరోజిని నాయుడు సోధరి సుహాసిని జర్మనీ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు, అమ్మ మరియు సుహాసినీల ప్రభావంతో స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా భాగస్వామి అయినారు. భారత దేశంలో మహాత్మ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు కాని అది గాంధీజీ అర్థాంతరంగా నిలిపి వేయటాన్ని వ్యతిరేకించారు. సింగపూర్ బ్రిటీషు వారి పాలనలో ఉన్నప్పటికీ, జపాన్ వారి దాడులు జరుగుతున్న సందర్భాల్లో సైతం దేశంతో సంభందం లేకుండా ఒక వైద్యురాలిగా ఎంతో శ్రమకోర్చి వైద్య సేవలందించారు. అదే కొలంలో కెప్ట్ న్ మోహన్ సింగ్ ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు. ఆ దళంలో చేరుటకు లక్ష్మీ సెహగల్ సిధ్ధ పడ్డారు. అనతికాలంలోనే దాని భాద్యతలు తీసుకోవలసిందిగా మోహన్ సింగ్ అతని అనుచరులు సుబాష్ చంద్రబోష్ ను కోరారు. దానికి అంగీకరించారు భాద్యతలు స్వీకరించారు. బోష్ ఉపాన్యాసమునకు మంత్రముగ్ధులైన భారతీయులు స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములగుటకు సధ్ధపడ్డారు. ముఖ్యంగా మహిళలు భాగస్వాములయితే స్వాతంత్ర్య ఉద్యమం విజయవంతం అవుతుందని ఆహ్వన సభకు హాజరైన మహీళలకు కబురు పంపమని చెప్పారు. మొదటి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీ బాయి పేరుతో ఒక మహిళా గ్రూపును ఏర్పాటు చేసి దానిలో పనిచేయుటకు ఆహ్వన సభకు హాజరైన 20 మంది మహిళలు హాజరైతే వారిలో 15 మంది మహిళలు సిధ్ధమయ్యారు. వారిలో లక్ష్మీ సెహగల్ దైర్య సాహసాల్ని గమనించిన బోష్ ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమ్ కు లక్ష్మీ సెహగల్ ను అధిపతిగా నియమించారు. అప్పటినుండీ స్వాతంత్ర్య సమరంలో భాగస్వాములైనారు.1945 వ సంవత్సరంలో బర్మాలో ర్యాలీలో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 1971 వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ మార్కిష్టు తరుపున రాజ్యసభ సభ్యులు అయ్యారు. బంగ్లాదేశ్ క్షామం సంధర్భంగా ఉచిత వైద్య సేవలు అందించారు. బోపాల్ గ్యాస్ దురఘటన సంధర్భంగా వైద్య సేవలు అందించారు.1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరు. 1998 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మ విభూషన్ బహుమతితో సత్కరించింది. 2002 వ సంవత్సరం భారత రాష్ట్రపతిగా పోటి చేశారు అబ్ధుల కలాం ప్రత్యర్థిగా, వామపక్ష అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. 2012 జులై 23 న మరణించారు. తుది శ్వాస విడిచేవరకు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు.సరోజిని నాయుడు సోధరీ సహాసీనీ భోధించిన దోపిడీ, పీడన పాఠాలు మరవలేదు. దోపిడీ కి వ్యతిరేకంగా నినదించారు, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నినదించారు. ఆమె యెక్క పోరాటానికి ప్రతిరూపంగా సుభాషిణి అలీని చైతన్యపథంలో నడిపారు ప్రస్తుతం ఆమె సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు గా ఉన్నారు.